బాబోయ్ మిడ‌తలు… తెలుగు రాష్ట్రాల‌కు పొంచి ఉన్న ముప్పు..

-

క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ప్ర‌జ‌లు ఓ వైపు భయాందోళ‌న‌ల‌కు గుర‌వుతుంటే.. మ‌రో వైపు మిడ‌త‌లు రైతుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొన్ని కోట్ల సంఖ్య‌లో మిడ‌త‌లు ప్ర‌స్తుతం ఉత్త‌ర భార‌త‌దేశంలోని రాష్ట్రాల్లో పంట పొలాల‌పై దండెత్తుతున్నాయి. ఎక‌రాల కొద్దీ పంటను స్వాహా చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. ఇక ఆ మిడ‌త‌ల వ‌ల్ల రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప్ర‌స్తుతం ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు అంటున్నారు.

locust swarms attack crops in north indian states

ఆఫ్రికా దేశాలైన ఇథియోపియా, సోమాలియాల్లో ఉండే మిడ‌త‌లు కొన్ని కోట్ల సంఖ్య‌లో ప్ర‌స్తుతం మ‌న దేశంపై దండెత్తాయి. ఇవి అంత‌కు ముందు పాకిస్థాన్‌కు వ‌చ్చాయి. అక్క‌డి నుంచి ఉత్త‌ర భార‌తదేశంలోకి ప్ర‌వేశించాయి. రాజస్థాన్‌, గుజ‌రాత్‌, పంజాబ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో దాదాపుగా 2.05 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల ప్రాంతంపై కొన్నికోట్ల మిడ‌త‌లు దాడి చేశాయి. రాజ‌స్థాన్‌లోనైతే ఏకంగా 5 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో వేసి పంట‌ల‌ను ఈ మిడ‌తలు తినేశాయి. ఈ క్ర‌మంలో రైతుల‌కు మిడ‌త‌ల బారి నుంచి త‌ప్పించుకోవాలంటే ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు.

సాధార‌ణంగా త‌క్కువ సంఖ్య‌లో ఉండే మిడ‌త‌లైతే పెద్ద పెద్ద శ‌బ్దాలు చేస్తే వెళ్లిపోతాయి. కానీ ఇప్పుడు వ‌చ్చిన మిడ‌త‌లు కోట్ల సంఖ్య‌లో ఉన్నాయి. మ‌రోవైపు రోజు రోజుకీ ఇవి త‌మ సంఖ్య‌ను వృద్ధి చేసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు రంగంలోకి దిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌వ‌సాయ డ్రోన్ల‌ను వాడేందుకు అనుమ‌తి ఉండేది కాదు. కానీ కేంద్రం తాజాగా వాటికి అనుమ‌తివ్వ‌డంతో ఆ డ్రోన్ల స‌హాయంతో ర‌సాయ‌నాల‌ను పిచికారీ చేసి మిడ‌త‌ల సంఖ్య‌ను త‌గ్గిస్తున్నారు. అయితే ఉత్త‌రాది రాష్ట్రాలు అయిపోతే మిడ‌తలు నేరుగా ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌డ‌తాయ‌ని, క‌నుక అవి న‌ష్టాన్ని క‌లిగించ‌క‌ముందే ఇప్పుడే ప్ర‌భుత్వాలు స్పందించి వాటిని నిర్మూలించ‌డానికి సిద్ధంగా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news