కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి రాకపోకలను నిలిపివేసింది. ఆ రాష్ట్ర వాసులు తమ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలోనూ రాకూడదని కర్ణాటక తెలిపింది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలు, రైళ్లను తమ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని కర్ణాటక తెలిపింది.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రాష్ట్ర కేబినెట్ తెలియజేసింది. పైన తెలిపిన రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా వాహనాలను అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా గురువారం వరకు కర్ణాటకలో 2493 కరోనా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఒక్క రోజే 75 కొత్త కేసులు వచ్చాయి. ఇక మహారాష్ట్రలో మొత్తం 56,948 కేసులు, గుజరాత్‌ళో 15వేలు, తమిళనాడులో 18,545, మధ్యప్రదేశ్‌లో 7,261, రాజస్థాన్‌లో 7,703 కరోనా కేసులు నమోదయ్యాయి.