ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార వైసీపీ నేతలు కొందరు అనుసరిస్తున్న తీరు సిఎం వైఎస్ జగన్ కి ఇబ్బందిగా మారే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. సోషల్ మీడియా వేదికగా అలాగే విశాఖలో డాక్టర్ సుధాకర్ విషయంలో జరిగిన కొన్ని వ్యవహారాలూ జగన్ కి తెలియకుండా జరుగుతున్నాయి. సోషల్ మీడియా పక్కన పెడితే విశాఖ డాక్టర్ విషయంలో జగన్ కి కనీసం సమాచారం లేదని అంటున్నారు. ఇక ఆ విషయంలో అనవసరంగా తొందరపడటం తో ఇప్పుడు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అని తెలుస్తుంది.
ఇప్పుడు అనవసరంగా అధికారులు ఇరుక్కోవడమే కాకుండా వైసీపీ ప్రభుత్వం పరువు కూడా తేడా వస్తే పోయే సూచనలే ఉన్నాయి. ఇక ఈ విషయంలో జగన్ కూడా ఆగ్రహంగానే ఉన్నారు. సిబిఐ విచారణ అంటే ఏ స్థాయిలో ఉంటుందో అందరికి తెలిసిందే. అంటే ఇది దాదాపుగా కేంద్రం చేతుల్లో ఉన్నట్టు అనవసరంగా ఇప్పుడు అధికారులు ఎక్కువగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
విశాఖ సీపీ ఆర్కే మీనా కి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని ఆయన జగన్ కి అత్యంత సన్నిహిత అధికారి అని అంటున్నారు. ఇక అధికారులు కొందరు ఇప్పుడు ఎం సమాధానం చెప్పాలో అర్ధం కాని పరిస్థితి లో ఉన్నారు. ఇక విశాఖ మెంటల్ ఆస్పత్రి వైద్యులు తనకు ఇచ్చే మందుల విషయంలో తేడా చేస్తున్నారని సుధాకర్ అన్నారు. తేడా ఏది అయినా జరిగితే ముందు తిట్టేది ప్రభుత్వాన్ని. అంటే అంతిమంగా ఇబ్బంది పడేది సిఎం జగన్. ఇక కీలక మంత్రి కూడా ఒకరు ఈ విషయంలో అనవసరంగా దూకుడు ప్రదర్శించారు అని అదే ఇబ్బంది తీసుకొచ్చి అనే భావన లో కూడా జగన్ ఉన్నారట.