గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో గత కొద్ది రోజులుగా రేటింగ్స్ గణనీయంగా పడిపోవడంతో టిక్‌టాక్ ఆందోళన చెందింది. కానీ గూగుల్ ఆ యాప్‌కు పెద్ద ఎత్తున వచ్చిన 1 స్టార్ రేటింగ్స్‌ను తొలగించింది. దీంతో ఆ యాప్ రేటింగ్స్ మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో టిక్‌టాక్ బతుకు జీవుడా.. అంటూ ఊపిరిపీల్చుకుంది.
యూట్యూబర్లు, టిక్‌టాక్ యూజర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా.. గత కొద్ది రోజుల నుంచి టిక్‌టాక్‌కు యూజర్లు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో కేవలం 1 స్టార్ మాత్రమే రేటింగ్ ఇచ్చి ఆ యాప్‌ను పెద్ద ఎత్తున తమ తమ ఫోన్ల నుంచి తొలగించారు. దీంతో టిక్‌టాక్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఓ దశలో గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ యాప్‌కు 1.2 రేటింగ్ వచ్చింది. అయితే దీనిపై గూగుల్ స్పందించింది. అలాంటి 80 లక్షల రేటింగ్స్‌ను గూగుల్ ఒకేసారి ప్లే స్టోర్ నుంచి తొలగించింది. దీంతో టిక్‌టాక్ రేటింగ్ ప్రస్తుతం ప్లే స్టోర్‌లో మళ్లీ 4.4కు చేరుకుంది.
అయినప్పటికీ మన దేశంలో మాత్రం ఇంకా బ్యాన్ టిక్‌టాక్ అనే ఉద్యమం కొనసాగుతోంది. ఇక టిక్‌టాక్ యాప్ మళ్లీ ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో, లేదో చూడాలి.