దోపిడి మాత్రమే తెలిసిన గాడిదలకు గాడిద గుడ్డే కనిపిస్తుంది : బండి సంజయ్

-

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ఏమి లేదని.. వారు రాష్ట్రానికి ఇచ్చింది కేవలం గాడిద గుడ్డు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి నిన్న విమర్శలు చేసిన విషయం విధితమే. ఈ వ్యాఖ్యలపై కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు.

’60 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన హైవేలకు సమానంగా 10 ఏళ్లలోనే నిర్మిస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. గిరిజనుల ప్రగతికి సమ్మక్క సారలక్క గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. రైతుల ఎరువు కష్టాలు తీర్చేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపిస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. పన్నుల వాటా 32 శాతం నుంచి 41 శాతం వరకు పెంచితే తెలంగాణకు ూ.1.60 లక్షల కోట్లు ఇస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు.. రాష్ట్రానికి పథకాలు, అభివృద్ధి పనుల కోసం రూ.5 లక్షల కోట్లు ఇస్తే.. అది కాంగ్రెస్ కు గాడిద గుడ్డు. తెలంగాణ ప్రగతికి దాదాపు రూ.10లక్షల కోట్ల రుణ సాయం అందిస్తే.. కాంగ్రెస్ అది గాడిద గుడ్డు’ అని రాసుకొచ్చారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news