నిధీ అగర్వాల్ ‘జుంబారే జు జుంబారే’ ..!

-

సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనళ్లుడు.. ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘దేవదాస్’ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

గల్లా అశోక్ తన తాతగారి పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యమలీల’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘జుంబారే జుమ్ జుంబారే’ అనే పాటను అశోక్ గల్లా ఈ సినిమాలో రీమేక్ చేసాడు. ఈ పాటలో సూపర్ స్టార్ కృష్ణ ను అనుకరించి ఆకట్టుకున్నాడు. కృష్ణ సిగ్నేచర్ స్టెప్ అలాగే ఆయన హావభావాలు అశోక్ ఈ సాంగ్ లో చూపించాడు. ఇక ఈ పాటకు నిధి అగర్వాల్ గ్లామర్ డ్యాన్స్ బాగా ప్లస్ అవుతాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ సగ భాగం కంప్లీటయిందట.

జగపతి బాబు సీనియర్ నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫైఇ అందిస్తున్నారు. మొత్తానికి నిధి అగర్వాల్ ఈ పాటలో ‘జుంబారే జుమ్ జుంబారే’ అనిపించడమే కాదు మరో మంచి సక్సస్ ను దక్కించుకుంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తో పాటు నిదీ మాస్ మహారాజా రవితేజ సరసన నటిస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news