కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి సర్వదర్శనం కోసం ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ, నడకదారి భక్తులకు ఉదయం 7 గంటల నుంచి టైంస్లాట్ కింద టీటీడీ భక్తులకు టోకెన్లను జారీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటలు, టైం స్లాట్, దివ్య, ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారికి హుండీ ద్వారా 3.59కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.