క్వారంటైన్‌ కేంద్రాల్లో కామాంధులు.. కరోనా ఉన్నా ఆపని కామ చర్యలు.. ?

-

లోకంలో ఎన్నో సమస్యలు మనుషులను వెంటాడుతున్నా అవేవి పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు.. వీరి ప్రవర్తన చూస్తే కుక్కలే వీరికంటే నయం అనిపించేలా ఉంటుంది.. ఎందుకంటే కరోనా వైరస్‌తో ప్రపంచంలో చీకట్లు ముసురుకుంటుంటే.. తోచిన సహయం చేయవలసింది పోయి.. తోడేళ్లలా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు.. చివరికి కరోనా కోసm కెటాయించిన క్వారంటైన్‌ కేంద్రంలో కూడా ఇలాంటి నీచాలకు పాల్పడుతున్నారు.. ఇటువంటి ఆకృత్యాలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నా, అధికారులు చర్యలు తీసుకుంటున్నా గానీ తగ్గడం లేదు..

ఇక ఒక బాధ్యత గల పదవిలో ఉన్న సర్పంచ్ కూడా చివరికి కామంతో బుసలు కొడుతూ, వలస కార్మికురాలిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సువర్ణపూర్‌ జిల్లా డుంగురిపల్లి సమితి అందారిబంచిలో ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాలు చూస్తే.. అందారిబంచి క్వారంటైన్‌ కేంద్రాన్ని రోజు ఆ ఊరి సర్పంచ్ సందర్శించేవాడు.. అయితే అక్కడే ప్రత్యేక గదిలో ఉంటున్న ఓ యువతి పై కన్నేసిన ఈ నీచుడు రోజూ రాత్రిపూట మద్యం తాగి కేంద్రానికి వచ్చి తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతి ఆరోపించింది.

 

ఈ విషయాన్ని కేంద్రం నిర్వాహకులకు తెలిపిన వారు పట్టిపట్టనట్లుగా ఉండటంతో తన బాధనంతా వెల్లడిస్తూ, తనకు న్యాయం చేయాలంటూ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్‌ చేసింది. ఇక ఈ వీడియో చర్చనీయాంశంగా మారి పోలీసుల దృష్టిలో పడటంతో, ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట..

Read more RELATED
Recommended to you

Latest news