మహారాష్ట్ర సీఎంను కలిసిన సోనూసూద్..!

-

కరోనా కష్టకాలంలో వలసకులీలకు అండగా నిలిచి వారిని వారి గమ్య స్థానాలకు చేర్చడంలో ఎంతో చొరవ తీసుకున్నారు నటుడు సోనూసూద్‌. అలాగే తుఫాన్ సమయంలో ముంబై లోని ఎందరికో ఆయన అండగా నిలిచారు. అయితే సోనూసూద్‌ కు రాజకీయ మద్దతు ఉందని శివసేన నేత సంజయ్‌ రౌత్ తాజాగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదంటూ సోనూసూద్ సంకేతం ఇచ్చారు. ఈ సమావేశంలో వారు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news