కొంత మందికి దరిద్రం ఏ రూపంలో వస్తుందో చెప్పడం చాలా కష్టం. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కొందరి ప్రాణాలు పోతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా మనం ఎన్నో ఘటనలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. తాజాగా ఒక గర్భిణి పేస్టూ అనుకుని ఎలకల మందుతో బ్రష్ చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడేనికి చెందిన దర్శినపు నాగరాజుకు కృష్ణాజిల్లా జంగన్నగూడెం గ్రామానికి చెందిన మౌనికతో ఏడాది క్రితం వివాహం చేసారు.
మౌనిక తొమ్మిది నెలల గర్భంతో ఉంది. మరి కొన్ని రోజుల్లో ఆమె ప్రసవించే అవకాశం ఉందని వైద్యులు డేట్ కూడా ఇచ్చారు. దీనితో ఇంటిల్లపాది కూడా సంతోషంగా ఉన్నారు. పుట్టబోయే పాపాయి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మౌనిక కూడా రోజులు దగ్గరకు వస్తు ఉండటంతో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. వైద్యుల సలహాలను పాటిస్తూ ముందుకు వెళ్తుంది.
ఈ తరుణంలో మౌనిక ఈ నెల 5న ఇంట్లోని ఎలుకల మందును పళ్లు తోముకునే పేస్ట్ అనుకుని బ్రష్ మీద వేసుకుంది. రెండు రోజులు బాగానే ఉండగా ఆ తర్వాత ఆమె ఆరోగ్యం ఆరోగ్యం క్షీణించడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించచారు. పరిక్షలు చేసిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు ప్రకటించారు. ఆమె ఆరోగ్యం కూడా విషమించడంతో గుంటూరు తరలించారు. అక్కడ ఆమె చికిత్స తీసుకుని సోమవారం ప్రాణాలు కోల్పోయింది.