మహిళా కష్టమర్‌ను వెతుక్కుంటూ వెళ్లి చితక్కొట్టిన షాప్ యజమాని.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. ?

-

చైనా నీతిమాలిన దేశం అన్న విషయం అందరికి తెలిసిందే.. ఈ మధ్యకాలంలో చైనా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు పలు వివాదాలకు దారితీస్తుంది.. ఇక అక్కడి ప్రభుత్వమే కాదు అక్కడి మనుషులు కూడా తేడానే అని ఈ ఘటన నిరూపించింది.. ఇంతకు జరిగిన విషయం ఏంటంటే.. చైనాలో ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో ఎవరైనా ఏదైనా వస్తువు కొంటే దాని నాణ్యత విషయంలో రివ్యూ ఇస్తారు. అంతే కాకుండా ఆ సైట్ సకాలంలో డెలివరీ చేసిందా లేదా అనే విషయానికి కూడా రేటింగ్ ఇస్తారు.

ఇక అదే వస్తువును వేరే వారు ఎవరైనా కొనే ముందు ఇంతకు ముందు కొన్న వినియోగదారులు ఇచ్చిన రివ్యూలను పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆ వస్తువులు అమ్ముతున్న యజమానులకు కస్టమర్లు ఇచ్చే రివ్యూలు ఎంతో ముఖ్యమైనవి. ఈ క్రమంలో జియో డి అనే ఓ మహిళా కష్టమర్ ఒక ఆన్‌లైన్ ‌సైట్ నుంచి‌ 300 యువాన్ల (భారత కరెన్సీలో సుమారు రూ.3000) విలువైన బట్టలను ఆర్డర్‌ పెట్టగా మూడురోజుల్లో అవి వస్తాయని కంపెనీ నుంచి మెసేజ్‌ వచ్చింది. కానీ, వారు చెప్పిన సమయానికి అవి డెలివరీ కాలేదు.

 

దీంతో ఆగ్రహించిన ఆమె ఆన్‌లైన్‌లో ఆ స్టోర్‌కు నెగిటివ్‌ రివ్యూ ఇచ్చింది. ఈ దెబ్బకు స్టోర్‌ స్కోరు 12 పాయింట్లు పడిపోయింది. దీంతో కోపం వచ్చిన యజమాని జాంగ్. 850 కిమీ దూరంలో ఉన్న ఆ మహిళా కష్టమర్‌ను వెతుక్కుంటూ వెళ్లి రోడ్డు మీదే చితక్కొట్టాడట. కాగా ఈ దృశ్యాలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి..

Read more RELATED
Recommended to you

Latest news