సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా..! హాట్ స్టార్ లో విడుదల..!

-

sushanth singh rajput last film dil bechara to be realesd on hotstar soon
sushanth singh rajput last film dil bechara to be realesd on hotstar soon

డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరిసారిగా చిచ్చోరే అనే చిత్రంలో హీరోగా కనిపించాడు. ఇక ఆపై అతను ‘’దిల్ బెచార’’ అనే రొమాంటిక్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ‘ద ఫాల్ట్స్ ఇన్ అవర్ స్టార్స్’ అనే ప్లే కు రీమేక్. సినిమా షెడ్యూల్ పూర్తయింది ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి కానీ కోవిడ్ వ్యాప్తి కారణంగా లక్ డౌన్ విధించడంతో ఆయన సినిమా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయ్యింది. ఇక ఈ సినిమాని థియేటర్లు వచ్చేంతవరకు ఆపకుండా ఆన్ లైన్ ద్వారా డిజిటల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా యొక్క రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. కాగా ఈ సినిమా ని దివంగత నటుడికి గుర్తుగా హాట్ స్టార్ యాప్ సుశాంత్ అభిమానులు ఫ్రీగా వీక్షించేందుకు ట్రిబ్యూట్ గా విడుదల చేయనుంది. ఈ సినిమా జూలీ 24 న రిలీజ్ చేస్తునట్టుగా హాట్ స్టార్ పేర్కొంది. ఈ సినిమాలో సుశాంత్ సరసన సంజనా సంఘీ నటించగా మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. సినిమాకి ముకేష్ చాబ్రా దర్శకత్వం వహించగా ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు ఏ‌ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news