ఏం అయ్యింది మోడీ గారు… ప్రజలకున్న చిత్తశుద్ధి మీకు లేదా..?

-

twitteratis questioning pm modi over receiving fund from chinese companies
twitteratis questioning pm modi over receiving fund from chinese companies

భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపద్యంలో భారత్ చైనా ల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. చైనా కంపెనీలను చైనా వస్తువులను భారత ప్రజలు బహిష్కరిస్తున్నారు. చైనా యాప్ లను డిలీట్ చేస్తున్నారు చైనా కంపెనీల్లో పని చేస్తున్న వారు రిజైన్ చేస్తున్నారు. కేంద్రం కూడా చైనా వస్తువులను వాడవద్దని దేశీయ వస్తువులకు ప్రాదాన్యత ఇవ్వాలని కోరుతుంది భారత్ ను ఆత్మ నిర్భర భారత్ గా తీర్చి దిద్దమని అభ్యర్థిస్తుంది. భారత ప్రజలు ఈ నియమాలను బాగానే ఫాలో అవుతున్నారు కానీ కేంద్రానికి ఆ చిత్త శుద్ధి ఉందా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. తాజాగా చైనా లోని ప్రసిద్ధ మొబైల్ కంపెనీ హువాయి కారోనాను పోరాడేందుకు భారత్ కు ఆర్థిక సాయంగా 7 కోట్ల రూపాయలను పీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని ఉద్దేశించి నెటిజన్లు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. చైనా ను బహిష్కరించండి అంటూనే చైనా వారు ప్రకటించిన ఆర్థిక ఫండ్ ను ఎందుకు ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. చైనా ఫండ్ ను తిరిగి చైనా కి ఇచ్చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరు కేంద్ర మంత్రులను ఈ అంశం పై స్పందించండి అంటూ ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం ట్వీట్టర్ లో ట్రెండింగ్ గా నిలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news