గ‌జ‌ప‌తుల రాజ‌కీయ ర‌గ‌డ‌‌లో స‌రికొత్త ట్విస్ట్‌.. ఇదే..!

-

రాజ‌కీయాల్లో ఆరితేరిన చంద్ర‌బాబు.. త‌న ఉన్న‌తి కోసం(అలా కాకుండా స్వార్థం అని కూడా అంటారు కొంద‌రు) వేయ‌ని అడుగు లేదు.. చేయ‌ని ప‌నిలేదు. సొంత కుటుంబంలోనే చిచ్చు పెట్టేందుకు ఆయ‌న వెనుకాడ‌రు. అదేస‌మ‌యంలో త‌న వారిని (త‌మ్ము డు రామ్మూర్తి నాయుడు) సైతం వ‌దిలిపెట్ట‌ని నైజం బాబుగారి సొంత‌మంటారు ఆయ‌న గురించి తెలిసిన వారు. తాజాగా ఇదే విష ‌యాన్ని చెప్పుకొస్తున్నారు… పూస‌పాటి సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజు. ప్ర‌స్తుతం విజ‌య‌నగ‌రంలో హాట్ టాపిగా ఉన్న గ‌జ‌ప‌తుల రా జ‌కీయాల్లో సరికొత్త ట్విస్టు వెలుగులోకి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై మౌనంగా ఉన్న సంచ‌యిత‌.. తాజాగా త‌న మ‌న‌సులో మాట‌ల‌ను ట్విట్ట‌ర్ రూపంలో వెల్ల‌డించారు.

సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మాన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా తన నియామకంపై వస్తున్న విమర్శలను సంచయిత తిప్పికొట్టారు. ఆనంద గజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్‌ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాల‌న్నారు. మా తండ్రి చితి ఆరకముందే చంద్ర‌బాబు, త‌న‌ బాబాయ్‌ అశోక్‌ గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీ చేశారనే షాకింగ్ విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు. అశోక్‌ గజపతిరాజు పదవీకాలంలో తప్పుడు చర్యలు కారణంగా మాన్సాస్‌ ఆర్థికంగా నష్టపోయింద‌ని, విద్యాసంస్థల్లో నాణ్యత పడిపోయింద‌ని అన్నారు. ట్రస్టు భూములు పరులపాలవుతుంటే ఆ కేసులను వాదించడానికి కనీసం లాయర్‌ను నియమించలేదన్నారు.

మాన్సాస్‌ లా కాలేజీ క్యాంపస్‌ను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు ఉచితంగా ఇచ్చేశారని, విద్యార్థులను షెడ్డుల్లోకి మార్చారని కూడా సంచ‌యిత సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. చివరకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఎలాంటి కుంభకోణంలో ఇరుక్కుందో జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందేన‌న్నారు. చంద్రబాబు తన సహచరుడ్ని పొగిడేముందు త‌మ‌ తాత, త‌న‌ తండ్రి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసంచేశారో తెలుసుకోవాలని చుర‌క‌లు అంటించారు. ఇవన్నీ మీకు తెలిసి, వీరిద్దరూ కలిసి చేసినవే అని ప్రజలు చెప్తున్నారని సంచయిత విమర్శించారు. మొత్తంగా గ‌జ‌ప‌తుల ర‌గ‌డ‌లో స‌రికొత్త ట్విస్టు తెర‌మీదికి వ‌చ్చాక‌.. చంద్ర‌బాబు ఇంత ప‌నిచేశారా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో చోటు చేసుకుంది. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఏమంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news