తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేయగా రెండో సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మూడవ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున దీన్ని విజయవంతం చేశారు.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 విషయానికొస్తే.. ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అక్కినేని కోడలు సమంత నాలుగో సీజన్ హోస్ట్ గా వ్యవహరించబోతోందట. నిర్వాహకులు ఈమెని హోస్ట్ గా తీసుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈసారి ఇంట్లో ఐదారుగురు అందగత్తెల ట్రీట్ ఉంటుందని తెలిసింది. వీళ్లలో శ్రద్ధా దాస్, హంసా నందిని, యామిని భాస్కర్, మోనా, ప్రియా వడ్ల మాని పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లో అగ్గి రాజేసేందుకు బరిలో దిగుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.