బకాయిలు తీర్చేసిన ప్రియాంక గాంధీ..!

-

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ప్రియాంక లోధి ఎస్టేట్‌లోని టైప్ 6బీలోని 35వ నెంబర్ బంగ్లాను అధికారికంగా వినియోగించుకుంటున్నారు. ఆగస్టు 1 నాటికి బంగ్లా ఖాళీ చేయాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఎస్పీజీ ప్రొటెక్షన్ కలిగిన వ్యక్తులకు మాత్రమే కేంద్రం ఈ బంగ్లా సదుపాయాన్ని కల్పిస్తుంది.

బంగ్లాను ఖాళీ చేసే ముందు పెండింగ్ లో ఉన్న రూ. 3.46 లక్షల మొత్తాన్ని చెల్లించాలని తేల్చి చెప్పింది. అయితే దీనికి సంబంధించి నోటీసులు అందగానే ప్రియాంక ఆ బంగ్లా యొక్క బకాయిలు తీర్చేశారు. ఈ విషయాన్ని కేంద్ర భవనాలు మరియూ పట్టణ వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. మొత్తం 3,46,677 రూపాయల బకాయిని కట్టేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news