డబ్బుకోసం రోజు కూలీలుగా మారి ఇల్లు వాకిలి వదిలి పనులకు పోయారు. మృత్యువు వెంటాడుతుందని వారికి తెలియదు. పనికి వెళ్లారులే తిరిగి వస్తారు అని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు కానీ ఎన్నటికీ తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయారు. దాదాపుగా 162 మంది కూలీలు కొండ చరియాలు విరిగిపడి చనిపోయారు ఈ ఘటన మయన్మార్ లోని కచిన్ రాష్ట్రం లో చోటు చేసుకుంది. గతంలో కూడా అదే ప్రాంతంలో కొండ చరియాలు విరిగి 113 మంది చనిపోయారు.
వివరాల్లోకి వెళితే.. మయన్మార్ లోని కచిన్ రాష్ట్రం హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి గని ఉంది. ఈ గనిని తవ్వెందుకు చాలా మంది కూలీలు పనిచేస్తారు. తవ్విన మట్టిని పక్కన పోస్తూ ఉండటం వారి పని. అయితే గత మూడు నాలుగు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండకు అంటుకొని స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్న ఆ కూలీల ఇళ్లపై కొండ చరియాలు ఊడి పడ్డాయి దాంతో ఒక్కసారిగా దాదాపుగా 50 మంది చనిపోయారు. కొండ చరియలు మట్టి తెప్పలు భారీగా పడటంతో ఆ మట్టి కింద ఇంకా చాలా మంది ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 162 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మృతదేహాలకోసం ఇంకా కూడా అధికారులు మట్టిని తవ్వుకాలు జరుపుతూనే ఉన్నారు.