ఆంధ్రప్రదేశ్ విశాఖ లో డీజీపీ గౌతమ్ సవంగ్ రెండు రోజులపాటు పర్యటించారు. పర్యటన అనంతరం డీజీపీ గౌతమ్ సావంగ్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ అనేక అంశాలపై స్పందించారు ఏపీ రాజధాని విషయం పై మాట్లాడినా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏ క్షణం అయిన విశాఖ కు తరలించవచ్చిన వారు అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గ్రే హౌండ్స్ కు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జగన్నాథపురంలో కేటాయించిన 384 ఎకరాలు సరిపోవని పేర్కొన్నారు. కాబట్టి సింహాచలంలోని అటవీ భూములను కేటాయించాలని కోరనున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే ఆ భూములను పరిశీలిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.
ఏపీలో కరోనా కలవరపెడుతున్నా పోలీసులు మాత్రం అద్భుతంగా పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా విధుల్లో 78 వేల మంది పోలీసులు ఉన్నట్టు చెప్పారు. అలాగే, ఇప్పటి వరకు 466 మంది పోలీసులు కరోనా బారినపడగా ఒకరు మృతి చెందినట్టు చెప్పారు. ఇక ఏపీలో పెరుగుతున్న డ్రగ్స్ రాకెట్ దృష్ట్యా ఇక పై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. విశాఖ ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి విషయంలో మావోయిస్టుల ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.