నగర నడిబొడ్డున రేవ్ పార్టీ.. మహమ్మారితో మజాక్..!

-

హైదరాబాద్ బంజారాహిల్స్‌ లోని ఓ స్టార్ హోటల్లో రేవ్ పార్టీ జరగడం తీవ్ర కలకలం రేపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి హోటల్లో పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు యువకులు కాగా మరో నలుగురు యువతులు ఉన్నట్లు సమాచారం. అలాగే పార్టీలో ఓ మంత్రి అల్లుడు కూడా పాల్గొన్నట్లు సమాచారం.

అలాగే వీరిలో ఒకరు ఉక్రెయిన్ జాతీయురాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో జూబ్లీహిల్స్‌ లో రేవ్ పార్టీ నిర్వహించిన సంతోష్ రెడ్డె ఈ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకోవడంతో.. అందుకు సంబంధించిన సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news