దిగ్గజ వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ సోదరుడు రమ్నిక్ భాయ్(95) కన్నుమూశారు. రమ్మిక్ భాయ్‌తో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ని స్థాపించారు ధీరూభాయ్ అంబానీ.
దిగ్గజ వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ సోదరుడు రామ్నిక్ భాయ్ అంబానీ కన్నమూశారు. 95వ ఏట గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సోమవారం తుది శ్వాస విడిచారు. హిరాచంద్, జమునాబెన్ అంబానీలకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆ ముగ్గురిలో పెద్ద అయిన రామ్నిక్ భాయ్ 1924లో జన్మించారు. రామ్మిక్ భాయ్‌తో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించారు ధీరూభాయ్ అంబానీ. రామ్నిక్ భాయ్ కుమారుడు విమల్ పేరు మీదే “విమల్” టెక్స్టైల్ బ్రాండ్‌ను ఏర్పాటు చేశారు ధీరూభాయ్ అంబానీ.
గత కొంత కాలంగా రమ్నిక్ భాయ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. లాక్ డౌన్ సమయంకి ముందు ఓసారి అర్ధరాత్రి తీవ్ర అనారోగ్యం పాలైతే అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ పై ఉంచారు. అనారోగ్యం దానికి తోడు వయసు ఎక్కువ అవడం మరణానికి మరింత చేరువ చేసింది.