ఇక పై 150 టీవీ ఛానల్స్ బంద్ …!

-

టీవీ ప్రేక్షకులకు నిజంగా ఇది షాక్. ట్రాయ్ కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. అయితే ట్రాయ్ ఆగస్టు 10 నుంచి కూడా కొత్త నిబంధనలు అమలు చేయాలని అనుకుంటోంది. అయితే ఇప్పటికే బ్రాడ్ కాస్టర్లకి ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరి ప్రభావం ఎక్కువగా పడుతుంది. టీవీ బ్రాడ్ కాస్టర్లు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తో వీరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త టారిఫ్ ఆర్డర్ తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది.

TV
TV

అయితే ఇప్పుడు ట్రాయ్ మాత్రం ఆర్డర్ జారీ చేసింది. మొన్నటి వరకు సభ్యులతో సమావేశాలు జరిగాయి. కానీ ఇప్పుడు ట్రాయ్ ఆర్డర్ జారీ చేసే సరికి బ్రాడ్కాస్టర్లు షాక్ కి గురయ్యారు. అలానే ఎన్‌టీవో 2.0 తమ ఛానల్ ప్రైస్ ఇన్ సామర్థ్యం తగ్గిపోతుందని చెబుతున్నారు. అయితే ట్రాయ్ ప్రతీ ఛానల్ ధరని నిర్ణయించింది. గరిష్ఠంగా ఇది రూపాయలు 12 వరకు ఉంది. కానీ ప్రస్తుతం అయితే రూపాయలు 19 వరకు ఉంది.

ఇదిలా ఉండగా ట్రాయ్ ఛానల్ ప్యాక్ డిస్కౌంట్ గరిష్టంగా 33 శాతానికి పరిమితం చేసింది ప్రస్తుతం ఇది 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. అయితే దీంతో నేరుగా బ్రాడ్కాస్టింగ్ పై ప్రతికూల ప్రభావం పడనుంది. ఎన్ టి ఓ 2.0 అమలు వల్ల భవిష్యత్తులో 100 నుంచి 150 వరకు ఛానల్స్ తొలగిపోవచ్చని తెలిపారు. అలానే ఆర్థికంగా ప్రయోజనం లేని ఛానల్ కనుమరుగవుతాయి అని కూడా చెప్పారు. ఇకపోతే ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జనవరి 1న నోటిఫై చేసింది.రెఫరెన్స్ ఇంటర్‌కనెక్ట్ ఆఫర్‌ను మార్చాలని కూడా బ్రాడ్‌కాస్టర్లను కోరింది. ఆగస్ట్ 10 నాటికి ఎన్‌టీవో 2.0 నిబంధనలు అమలు చేయాలని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news