వైద్య పరికరాలతో భారత్ కి ఇజ్రాయిల్ కృతజ్ఞత..!

-

భారత్​ చేసిన సాయానికి కృతజ్ఞతగా… కరోనాను ఎదుర్కొవడానికి అధునాతన వైద్య పరికరాలను పంపించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు భారత్​తో సంబంధాలు మరింత విస్తృతం చేసుకునే విధంగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 7న భారత్​ 5 టన్నుల ఔషధాలను ఇజ్రాయెల్​కు పంపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అభ్యర్థన మేరకు.. కీలకమైన హైడ్రాక్సీక్లోరోక్విన్​ను సైతం భారీగా సరఫరా చేసింది.ఈ నేపథ్యంలో భారత్​కు తిరిగి సాయం చేసింది ఇజ్రాయెల్. వైద్య పరికరాలతో పాటు పరిశోధకులు, రక్షణ నిపుణులతో కూడిన ప్రత్యేక విమానం సోమవారం భారత్​కు చేరుకుంది. ‘ఆపరేషన్ బ్రీథింగ్ స్పేస్​’ పేరిట చేపట్టిన ఈ మిషన్​లో భాగంగా పెద్ద ఎత్తున వెంటిలేటర్లను భారత్​కు పంపించింది.

india-isrol
india-isrol

భారత్​కు చేరుకున్న ఇజ్రాయెల్ పరిశోధక బృందం… వేగవంతమైన కొవిడ్-19 టెస్ట్ కిట్‌లను అభివృద్ధి చేయడానికి ఇక్కడి శాస్త్రవేత్తలతో పనిచేయనుంది. టెస్టింగ్ సమర్థతపై ‘చివరి దశ’ పరిశోధనలను నిర్వహించనుంది. 30సెకన్లలో ఫలితం వచ్చే విధంగా డీఆర్​డీఓతో కలిసి పనిచేస్తోంది ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిశోధక బృందం. దీంతోపాటు కరోనా సంక్రమణను వేగవంతంగా నిర్ధారించేందుకు అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయనున్నారు పరిశోధకులు.

Read more RELATED
Recommended to you

Latest news