ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్తగా ఇద్దరిని నామినేట్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం సిఫార్సుల మేరకు జకియా ఖానమ్, పండుల రవీంద్ర బాబును ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేశారు. గవర్నర్ కోటాలో గతంలో సత్యనారాయణ రాజు, రత్నా భాయి ఎమ్మెల్సీగా ఉన్నారు. వారి పదవీ కాలంలో ముగించడంతో వారి స్థానాల్లో వీరిద్దరిని ఆయన నామినేట్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ సమీకరణల కారణంగారవీంద్రబాబుకు ఎంపీ టిక్కెట్టు లభించలేదు.
ఆ సమయంలోనే రాజ్యసభకు పంపుతామని వైసీపీ నాయకత్వం ఆయనకు హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే రాజ్యసభ టిక్కెట్టు ఆయనకు దక్కలేదు. దీంతో తాజాగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇర పార్టీ కోసం పనిచేసిన జకియా ఖానుం భర్త మరణించాడు. దీంతో ఆ కుటుంబానికి న్యాయం చేసే ఉద్దేశ్యంతో ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకొన్నారు.