కరోనా మహకు కొద్ది రోజులుగా ఆర్థిక రంగంలోని వివిధ విభాగాలతో సమావేశమవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుఅందులో భాగంగానే ఇవాళ దేశంలోని పెద్ద బ్యాంకులు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు(ఎన్బీఎఫ్సీ) అధిపతులతో సమావేశం కానున్నారు. తీవ్రంగా ప్రభావతమైన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు మోదీ. ఈ మేరకు అధికారి ప్రకటన జారీ చేసింది కేంద్రం.
కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మే నెలలో ప్రకటించిన రూ. 20.97 లక్షల కోట్ల ప్యాకేజీలోని పలు అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నాయి. ఈ సమావేశం అంజెండాలో ప్రధానంగా.. రుణాల మంజూరుకు సమర్థవంతమైన వ్యవస్థ, సాంకేతికత ద్వారా ఆర్థిక సాధికారత, ఆర్థిక రంగలో స్థిరత్వం వంటి అంశాలు ఉన్నాయి. మౌలిక, వ్యవసాయ, ఎంఎస్ఎంఈలకు ఆర్థికంగా చేయూతనిస్తూ.. దేశ ఆర్థిక వృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ భేటీకి ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా హాజరుకానున్నారు.