ఆర్.ఆర్.ఆర్. నయా ట్విస్ట్: ప్ర‌జ‌లకు క్షమాపణ.. జగన్ కు సెటైర్!

-

విడతలవారీగా పూర్తి వైకాపా వ్యతిరేక శక్తిగా మారిపోతున్నారు వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు! మొదట్లో తన సమస్య.. “ప్రజల్లో పార్టీకి చెడ్డపేరు రావొద్దన్నదే తన తాపత్రయం” అని చెప్పిన ఆర్.ఆర్.ఆర్… అనంతరం వైకాపా ఎమ్మెల్యేలను, మంత్రిని టార్గెట్ చేశారు. అనంతరం ఇప్పుడు నేరుగా జగన్ పైనే సెటైర్స్ వేసేస్తున్నారు! ఫలితంగా తాన లక్ష్యం ఏమిటో చెప్పకనే చెబుతున్నారు!

నిన్నమొన్నటివరకూ జగన్ అంటే తనకు పిచ్చి, ప్రేమ అని చెప్పిన రఘురామకృష్ణంరాజు… తాజాగా జగన్ పై నేరుగానే సెటైర్స్ వేసేస్తున్నారు! తాజాగా మైకందుకున్న ఆర్.ఆర్.ఆర్… క‌రోనా సోకిన వ్య‌క్తిని చెత్తను తరలించడానికి వాడే మున్సిపాలిటి బండిలో తీసుకెళ్ల‌టం ఎంతో బాధాక‌ర‌మ‌ని.. ఈ ఘ‌ట‌న పై తాను సిగ్గుతో త‌ల‌దించుకుంటున్నాన‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు త‌న‌ని క్ష‌మించాల‌ని కోరారు.

అనంతరం… ఏపీలో కరోన విషయంపై స్పందించిన ఆయన… క‌రోనా రోగుల కోసం అంటూ జగన్ సర్కార్ కొత్త‌ అంబులెన్సుల‌ను ఆడంబ‌రంగా ప్రారంభించిందని.. అవి ప్ర‌చారానికి త‌ప్ప ప్ర‌జ‌లకు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌డంలేద‌ని తేల్చేశారు! త్వ‌ర‌లోనే క‌రోనా కేసుల విష‌యంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్ ‌కు చేరుకుంటుదని జోస్యం చెప్పిన ఆర్.ఆర్.ఆర్… రాష్ట్రంలో ప్ర‌తిదానికి జ‌గ‌న్ పేరు పెడుతున్న నేప‌ధ్యంలో, క‌రోనా చ‌ర్య‌ల‌కు కూడా “జ‌గ‌న్ కోవిడ్ కేర్” అని పెట్టాల‌ని సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news