ప్రముఖ కవి రాజకీయ నాయకుడు అయిన సినారె 89 వ జయంతిని ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.కాగా ఈయన రాజ్యసభ కు వెళ్ళిన మొదటి కవి గా రికార్డు సృష్టించారు. కవితలతో రచనలతో ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేశారు. సినీ రంగంలో కూడా ప్రవేశించి సినారే రాసిన పాటలు సినీరంగ ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించాయి. ఆయన కలం నుంచి జాలువారిన పద్యకావ్యాలు… గ్రంథ కావ్యాలు కూడా… ప్రేక్షకాదరణ పొందాయి.
అయితే ఈ రోజు సినారే గా పిలువబడే సి నారాయణ రెడ్డి 89వ జయంతి ని ప్రస్తుతం ఎంతో మంది తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి అయిన కేటీఆర్ సినారె జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన దక్షిణ భారతదేశం నుంచి రాజ్యసభకు వెళ్లినా మొట్టమొదటి కవి సినారే అంటూ వ్యాఖ్యానించారు, సినారే సార్వాసత సదన్ ఎడిటోరియం కు శంకుస్థాపన చేశారు కేటీఆర్. ప్రతిభ ప్రజ్ఞ పాండిత్యం ఉన్న వ్యక్తి సినారే అంటూ కొనియాడారు.