పత్తి రైతుల సమస్యలు అన్నీ ఇన్నీకావు. తెల్లబంగారం పండిస్తున్నారంటూ.. సమాజం పెద్ద పేరుతో పిలిచినా.. ఈ పత్తి సాగు తలకెత్తుకున్న రైతులకు ఉండే సమస్యలు ఎక్కువే. పంట పండించడం ఒక సమస్య అయితే.. సాగు చేయగా వచ్చిన పత్తిని మార్కెట్కు తరలించి అమ్ముకోవడం మరో ప్రధాన సమస్య. సరే! సాగు సమస్యను దాటడం కూడా పెను కష్టాలతో కూడుకున్నదే. పత్తి విత్తనాల మొదలు.. సాగు వరకు రైతులకు అనేక కష్టనష్టాలు పొంచి ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది.. చీడపీడలు. ముఖ్యంగా బీటీ పత్తిసాగులో మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయి. మొక్క ఎదుగుదల నుంచే రసం పీల్చే పురుగులు, గులాబీరంగు పురుగు (పింక్ బోల్ వార్మ్స్), అధిక తేమ, తక్కువ తేమ వల్ల పూత, కాయ రాలిపోవడం.
ఈ సమస్యల కారణంగా.. దాదాపు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం 20 నుంచి 30 రోజుల వ్యవధిలోనే ఆయా సమస్యలతో మొక్కు పెరుగుదల దశపైనే ప్రభావం పడుతుంది. అయితే, దీని బారి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో ప్రధానమైనది.. పురుగు మందుల వాడకం. ఈ విషయంలో అనేక కంపెనీల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏది వాడాలో .. ఏది వాడితో .. తమకు ప్రయోజనమో.. తెలియక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారికి మేలు చేసేలా.. ముఖ్యంగా మొక్క తొలిదశలో దానికి రక్షణ కవచంగా ఉండేలా ఉపయోగ పడే మందు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది.
`నోవా అగ్రిటెక్` సంస్థ సుదీర్ఘ కాలంగా రైతుల పక్షపాతిగా అనేక సేవలు అందిస్తోంది. రైతుల పంటలు రక్షించే మందులను ఉత్పత్తి చేయడం, రైతులకు వాటిని లాభాపేక్ష లేకుండా అందించడమే ధ్యేయంగా ఈ సంస్ధ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సంస్థ నుంచి నోవా ఎన్-క్లీన్ కాటన్ అనే ఉత్పాదన వచ్చింది. ఇది మంచి ఫలితాలను చూపించి.. పత్తి రైతుకు ఆపన్నహస్తం అందిస్తోంది. పత్తిపంటపై ఒక్కసారి పిచికారీ చేసిన వెంటనే ఈ మందు తీవ్ర ప్రభావం చూపిస్తుంది. రసం పీల్చే పురుగులను 100 శాతం అరికట్టి..రైతులకు కంటిపై నిద్రపట్టేలా చేస్తుంది. అంతేకాదు, మొక్కలో పచ్చదనం పెంపొందించేందుకు కూడా నోవా ఎన్-క్లీన్ కాటన్ ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రస్తుతం తెలంగాణ బీటీ పత్తి రైతులు చీడపీడలతో విసిగెత్తిపోయారు. ఇలాంటి వారికి అందివచ్చిన అవకాశం నోవా ఎన్ -క్లీన్ కాటన్. నోవా ఎన్-క్లీన్ కాటన్(250 మిల్లీ లీటర్లు+250 మిల్లీ లీటర్లు) వాడడం ద్వారా.. తక్కువ సమయంలోనే రైతులు ఎక్కువ లాభం పొందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. నోవా ఎన్-క్లీన్ కాటన్ వినియోగం ద్వారా రైతుకు దిగుబడి పెరగడంతోపాటు.. పత్తి నష్టాలకు చెక్ పడుతుందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. రైతులు వెంటనే ఈ మందును వాడి తెల్లబంగారాన్ని వృద్ధి చేసుకోవడమే తరువాయి..!!