మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి మరోసారి కరోనా పాజిటివ్

-

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ కేవలం సామాన్య ప్రజలనే కాదు ప్రజాప్రతినిధులు సైతం ఈ మహమ్మారి వైరస్ వణికిస్తోంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కరోనా వైరస్ బారిన పడుతుండటం ప్రజల్లో మరింత భయాందోళన కలిగిస్తుంది.

ఇటీవలే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ అనారోగ్యం బారిన పడి కరోనా పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా చికిత్స తీసుకున్నారు. ఈరోజుకి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా చికిత్స తీసుకుని పది రోజులు అవుతుంది. అయితే తాజాగా మరోసారి వైద్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ కి కరోనా నిర్దారిత పరీక్షలు నిర్వహించారు. అయితే పది రోజులు గడిచినప్పటికీ శివరాజ్ సింగ్ చౌహాన్ కి మరోసారి పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news