దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా సరే అన్ లాక్ దిశగా కేంద్రం అడుగులు వేస్తూ అన్ లాక్ 3 లోకి అడుగు పెట్టింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలు కూడా ఆ విధంగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఏపీ సర్కార్ అన్ లాక్ ని 3 ని ప్రకటించింది. అన్ లాక్ 3.0 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుంది అని ఏపీ సర్కార్ పేర్కొంది.
ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది. సినిమా హాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్ లు కు నో ఛాన్స్ అని స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్ లు, జిమ్ లకు నేటి నుండి అనుమతి ఇవ్వనుంది. స్వతంత్రదినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశం ఇచ్చింది. కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు ఉంటుంది అని స్పష్టం చేసింది