గుడ్ న్యూస్‌.. జైడ‌స్ క‌రోనా వ్యాక్సిన్‌కు రేప‌టి నుంచి 2వ ద‌శ ట్ర‌య‌ల్స్‌..!

-

దేశీయ ఫార్మా కంపెనీ జైడ‌స్ కాడిలా త‌న జైకోవ్‌-డి క‌రోనా వ్యాక్సిన్‌కు గాను ఆగ‌స్టు 6 నుంచి రెండో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు ఆ కంపెనీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇప్ప‌టికే ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేశామ‌ని ఆ కంపెనీ తెలిపింది. మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ల‌కు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురు కాలేద‌ని, అంద‌రూ ఆరోగ్యంగా ఉన్నార‌ని, ఈ నేప‌థ్యంలో రెండో ద‌శ ట్ర‌య‌ల్స్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది.

zydus cadila to start 2nd phase clinical trials for zycov-d in india

కాగా మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌ను జైడ‌స్ కాడిలా కంపెనీ జూలై 15 నుంచి ప్రారంభించింది. ఇందులో భాగంగా జైకోవ్‌-డి వ్యాక్సిన్‌ను వాలంటీర్ల‌కు ఇచ్చారు. వారిలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాలేదు. అంద‌రూ ఆరోగ్యంగా ఉన్నారు.. అని జైడ‌స్ కాడిలా చైర్మ‌న్ పంక‌జ్ ఆర్ ప‌టేల్ తెలిపారు. అందుక‌నే రెండో ద‌శ ట్ర‌య‌ల్స్‌ను చేప‌డుతున్నామ‌న్నారు.

కాగా భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ కు ఆ కంపెనీ ట్ర‌య‌ల్స్‌కు అనుమ‌తులు పొందిన వెంట‌నే జైడ‌స్ కాడిలా కూడా త‌న జైకోవ్-డి వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌కు అనుమ‌తులు పొందింది. భార‌త్ బ‌యోటెక్ క‌న్నా ముందుగానే జైడ‌స్ మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌ను పూర్తి చేయ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news