ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. చాల మంది ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా కొన్ని వేలమంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా ఈ వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు అందరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.
తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే అక్కడి ప్రభుత్వం పాఠశాలలను సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. వారికీ ఇంటర్నల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరల 9,10 తరగతి విద్యార్థులకు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో స్కూల్ కి ఎలాంటి విధానాలు పాటించాలనేది ప్రభుత్వం తెలిపింది.