తెనాలి పోలీసులు కేవలం ఒక్కరోజులోనే చోరీ కేసును చేధించారు. గుట్కా వ్యాపారి గా అనుమానిస్తున్న ఒకరి ఇంట్లో 2 నెలల క్రితం తిరుపతయ్య అనే దొంగ దొంగతనానికి పాల్పడ్డాడు.. అప్పుడు 5 లక్షల నగదును ఇంటి నుంచి చోరీ చేసినట్లు తెలుస్తోంది. దొంగతనం చేసిన తిరుపతయ్య రేపల్లె వాసిగా పోలీసులు గుర్తించారు. దొంగతనాలు ప్రవృత్తిగా బతుకుతున్న ఈ వ్యక్తి ఓ నేరం చేసి జైలు పాలయ్యాడు. అయితే బెయిల్ పై బయటికి వచ్చి మరల అదే ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు.
పోలీసులు గుట్కా వ్యాపారిగా అనుమానిస్తున్న నమ్మయ్య అనే బాధితుడు ఇంట్లో లేని సమయంలో తిరుపతయ్య మరో సారి దొంగతనం చేశాడు. అయితే నమ్మమ్య పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో రూ.2,50000 దొంగతనం జరిగినట్లు పేర్కొన్నాడు.కానీ తక్కువ సొమ్ము ఫిర్యాదు లో చూపించడంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. మొత్తం ఐదు లక్షల సొమ్ము చోరీకి గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నమ్మయ్య గుట్కా వ్యాపారం చేస్తున్నందున వలన ఇంత డబ్బులు సంపాదించి ఉంటాడని అందుకే ఫిర్యాదులో తక్కువ మొత్తం డబ్బును చూపించినట్లు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.