మన దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎంత మాత్రం తగ్గడంలేదు. గత వారం రోజుల నుంచి రోజుకు యావరేజ్ గా వేసుకున్నా రోజుకు 60 వేలకు పైగామె పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 24 లక్షలకు చేరువయ్యింది. వైరస్ కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో ఇప్పటికే భారత్ మూడో స్థానానికి చేరుకుంది.
ఇక ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ మరణాలు చోటు చేసుకున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ 46,705 మరణాలతో నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్ ను ఇప్పుడు ఇండియా వెనక్కు నెట్టి, 47,033 మరణాలతో ఆ స్థానాన్ని ఆక్రమించింది. నిజానికి కోవిడ్ మరణాల్లో ఇటలీని ఇండియా 13 రోజుల కిందటే దాటేసింది. అయితే దేశంలో కోలుకుంటున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రికవరీ రేటు కూడా బాగా పెరుగుతోంది.