మూడు గెటప్ లలో నాగ్.. అదిరిపోయే బిగ్ బాస్ ప్రోమో..!

-

తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేయగా రెండో సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మూడవ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున దీన్ని విజయవంతం చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 విషయానికొస్తే..

ఈ సారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించి స్టిల్స్, గ్లింప్స్ రిలీజ్ చేసిన స్టార్ మా సంస్థ.. ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో నాగార్జున మూడు గెటప్ లలో కనిపిస్తున్నారు. తాతగా, తండ్రిగా, కొడుకుగా నాగార్జున ఈ ప్రోమోలో అదరగొట్టాడు. ఇరుగుపొరుగు వారిళ్లలో జరిగే గిల్లి కజ్జాలను చూసి ఎంటర్ టైన్ మెంట్ పొందుతున్న తాత, మనవడికి మధ్యలో తండ్రి వచ్చి ఓ సర్ ప్రైజ్ చేస్తాడు. ఇంటి సభ్యులకు అదిరిపోయే ఎంటర్ టైన్ మెంట్ అంటూ బిగ్ బాస్ 4 గురించి అనౌన్స్ చేస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news