కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (15-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శ‌నివారం (15-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 15th august 2020

1. దేశంలో కొత్త‌గా 65,002 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్ 25,26,193కు చేరుకుంది. 6,68,220 మంది చికిత్స తీసుకుంటున్నారు. 18,08,937 మంది కోలుకున్నారు. 49,036 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

2. ఏపీలో కొత్త‌గా 8,732 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరుకుంది. 88,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,91,117 మంది కోలుకున్నారు. 2,562 మంది చ‌నిపోయారు.

3. తెలంగాణ‌లో కొత్త‌గా 1863 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 90,259కి చేరుకుంది. 66,196 మంది కోలుకున్నారు. 23,376 మంది చికిత్స పొందుతున్నారు. 684 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

4. ర‌ష్యా దేశం ఇటీవ‌ల విడుద‌ల చేసిన స్పుత్‌నిక్‌-వి క‌రోనా వ్యాక్సిన్‌కు గాను ఉత్ప‌త్తి ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. అక్క‌డ ఏడాదికి 500 మిలియ‌న్ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్నారు. ముందుగా అత్య‌వ‌స‌ర సేవ‌ల సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు.

5. కరోనా నేప‌థ్యంలో స్కూళ్ల‌ను ప్ర‌స్తుతం తెరిచే ప్ర‌స‌క్తే లేద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశంలో ప‌లు రాష్ట్రాలు సెప్టెంబ‌ర్ నెల నుంచి స్కూళ్ల‌ను ఓపెన్ చేయాల‌ని చూస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ మాత్రం క‌రోనా ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కు స్కూళ్ల‌ను తెర‌వ‌బోమ‌ని అన్నారు.

6. బ్రెజిల్‌లో కొత్త‌గా 50,644 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 32,75,520కి చేరుకుంది. 1,06,523 మంది చ‌నిపోయారు. ఒక్క రోజే అక్క‌డ 1060 మంది చ‌నిపోయారు. అమెరికాలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 5.2 మిలియ‌న్లు దాటింది.

7. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం దేశంలో డిసెంబ‌ర్ వ‌ర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణుడు క‌క్కిలాయా అన్నారు. మ‌రో 4 నెలల్లోగా క‌రోనా త‌గ్గుతుంద‌ని ఆశించ‌వ‌చ్చ‌న్నారు. వ్యాక్సిన్‌కు వ‌చ్చేందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని, అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

8. భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట‌లో జాతీయ జెండాను ఎగుర‌వేసిన ప్ర‌ధాని మోదీ క‌రోనా వ్యాక్సిన్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం దేశంలో 3 కంపెనీలు క‌రోనా వ్యాక్సిన్ల‌ను టెస్టు చేస్తున్నాయని, సైంటిస్టులు ఓకే చెప్ప‌గానే పెద్ద ఎత్తున ఉత్ప‌త్తి ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

9. ఆదివారం నుంచి మాతా వైష్ణోదేవి ఆల‌య ద‌ర్శ‌నానికి అనుమ‌తివ్వ‌నున్నారు. క‌రోనా నేప‌థ్యంలో అధికారులు అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్నారు. జ‌మ్మూలోని దుకాణాల‌ను తెరిచి ఉంచుతారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు విమానాశ్ర‌యం వ‌ద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో క‌రోనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.

10. ర‌ష్యా తయారు చేసిన స్పుత్‌నిక్‌-వి వ్యాక్సిన్‌కు సంబంధించిన ఫేజ్ 1, 2 క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ డేటాను భార‌త్‌కు చెందిన కంపెనీలు కోరాయి. ఈ మేర‌కు ర‌ష్యా దేశ మీడియా స్పుత్‌నిక్ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Latest news