ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వీల్‌చైర్ కి క్రిస్టీస్ అనే సంస్థ గురువారం వేలం పాట నిర్వహించగా రూ. 2.85 కోట్లు పలికింది. దీంతో పాటు హాకింగ్ థీసిస్‌కు సంబంధించిన కాపీని కూడా వేలం వేయగా అది రూ.5.75 కోట్లు పలికింది. స్టీఫెన్ హాకింగ్ ఆరోగ్య అవసరాల నిమిత్తం తనకు అనుకూలంగా రూపొందించుకోవడంతో దీనికి ప్రత్యకత ఉంది.నరాల సంబంధిత వ్యాధి కారణంగా కాళ్ళు, చేతులు కదపలేని స్థితిలో ఉండే హాకింగ్‌కు అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన వీల్‌చైర్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.