విజయవాడ : రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి లోకేశ్‌తో చర్చకు సిద్ధమా? అని చాలెంజ్ చేసిన టీడీపీ నాయకులు పత్తాలేరని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా తప్ప లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల్లోని 11 విద్యాసంస్థలను కేంద్రం చొరవతో రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. పదేళ్ల కాల పరిమితి ఉన్నా నాలుగేళ్లలోనే కేంద్రం చేసి చూపించింది. టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు రాయలసీమపై వివక్ష చూపాయి. కేంద్రీయ నట విశ్వ విద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేశాం. ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి చూపించే శ్రద్ద రాష్ట్రాభివృద్ధిపై చూపించడం లేదు.