కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఆమె అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ రోజు సీడబ్ల్యూసీ అత్యంత కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని ఎన్నుకోవడం, పార్టీ కేంద్ర కార్యాలయం మార్పుతోపాటు తాజా అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి చెందిన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్‌గాంధీ తప్పుకున్న విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి సోనియాగాంధీ తాత్కాళిక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. అయితే.. వయోభారం వల్ల పార్టీ బాధ్యతలు నిర్వర్తించడంలో ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలను తిరిగి రాహుల్‌గాంధీకి అప్పగించేందుకే ఈ రోజు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ కూడా తన రాజీనామాను ప్రకటించనున్నట్లు సమాచారం.