నేటి బంగారం, వెండి ధరలు..!

-

పసిడి ప్రియులకు శుభవార్త. గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు స్థిరంగా ఉండి. ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధరతోనే కొనసాగుతుంది. దీంతో గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తుంది.. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 400 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 55,060కు చేరింది.

అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ధర రూ. 360 తగ్గడంతో రూ. 50,480కు చేరుకుంది. అయితే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 700 తగ్గిపోయింది. దీంతో ధర రూ. 67,100కు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ.350 మేర తగ్గడంతో రూ.55,600 చేరుకుంది. అలాగే రూ.300 తగ్గుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000కి దిగొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news