క‌రోనా బారిన ఉసేన్‌ బోల్ట్‌

-

జమైకా దిగ్గజ స్ప్రింటర్‌ ఉసేన్‌ బోల్ట్‌ కరోనా వైర‌స్‌ బారిన పడ్డారు. కొవిడ్‌ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. *గుడ్‌ మార్నింగ్‌.. నాకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. శనివారం చేసిన పరీక్షలో ఇది బయటపడింది. నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. అందుకే హోం క్వారంటైన్‌లోకి వెళ్తున్నాను. నా ప్రజలు అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను* అని ట్వీట్ చేశారు.

ఆగస్టు 21న ఉసేన్‌ బోల్ట్‌ తన 34వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అయితే ఈ పార్టీకి హాజరయిన వారు ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. భౌతిక దూరం అనే మాటేలేదు. అయితే, ఇప్పుడు ఉసేన్ బోల్ట్ కరోనా బారినపడటంతో ఆ పార్టీలో పాల్గొన్నవారందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news