ట్రల్ టికెట్ ఇవ్వలేదన్న కోపంతో అలిగి వైఎస్సార్ సీపీకి దూరమయ్యారు. ఈక్రమంలోనే ఆయన చంద్రబాబు విసిరిన పావుకు చిక్కుకుని టీడీపీలో చేరారు. అయితే, అక్కడ కూడా ఆయన సాధించింది ఏమీలేదు. ఇక, ఇప్పుడు ఖాళీగా ఉన్న రాధాను బీజేపీలోకి చేర్చుకునేందుకు ఉన్న అవకాశాలను కమల నాథులు పరిశీలిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
త్త రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు.. పార్టీని బలోపేతం చేసేందుకు తనకున్న అవకాశాలను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువ నాయకుడిగా ఉన్న కాపు వర్గానికి చెందిన రాధాను పార్టీలోకి తీసుకుంటే బెటరని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకున్నా.. త్వరలోనే సోము మనుషులు వంగవీటితో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
అయితే, రాధా అమరావతి రాజధాని కోసం పట్టుబడుతున్నారు. ఈ సమయంలో రాజధాని విషయంలో జోక్యం చేసుకునేది లేదని బీజేపీ స్పష్టం చేయడంతో ఆయన ఆ పార్టీలో కి వెళ్తారా? అనేది సందేహమే.కానీ, ఆపార్టీలోకి వెళ్తే.. కేంద్ర స్థాయిలో ఏదైనా మంచి భవిత ఉండే అవకాశం ఉందని, ప్రస్తుతం టీడీపీ పుంజుకునే పరిస్థితి లేనందున పార్టీ మార్పు తప్పదని వంగవీటి అనుచరులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.