300 ఏళ్ల నుంచి తిరుమల లడ్డూకి ప్రత్యేకత ఉంది : సీఎం చంద్రబాబు

-

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి 300 ఏళ్ల నుంచి ఓ ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డూలో  వాడే పోషక పదార్థాలు ప్యూర్ గా ఉంటాయి. నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. గత ఐదేళ్లు రాజకీయాలకు పునరావాసంగా మార్చారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు తిరుమల పవిత్రను కాపాడాం. అన్నదానానికి రూ.2వేల కోట్ల కార్పస్ ఉంది. వెంకటేశ్వరస్వామి అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్స్ చేశారు. ఏడు కొండలను వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 5 కొండలు అంటేనే.. ఫైట్ చేశానని.. ఫైట్ చేయడంతో పాటు 7 కొండలు ఎక్కి మొక్కుతీర్చుకున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. సుప్రబాత్ దర్శనంకి వెళ్లితే.. వైకుంఠం ఎలా ఉంటుందో తెలుస్తుంది. దేవుడి పవిత్రను కాపాడేందుకు ఎప్పుడూ ప్రయత్నించాం. తిరుమలలో చేసే వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. ఆయుర్వేద చెట్లను కూడా పెంచాం. కానీ గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వల్ల పెద్ద పెద్ద సంస్థలు రాకుండా వచ్చాయి. నాసిరకానికి చెందిన తీసుకువచ్చింది గత ప్రభుత్వం. నాసి రకం నెయ్యి వల్లనే కల్తీ జరిగిందని వెల్లడించారు సీఎం చంద్రబాబు. 

Read more RELATED
Recommended to you

Latest news