తిరుమల శ్రీవారితో నాకు ప్రత్యేక అనుబంధం : సీఎం చంద్రబాబు

-

తిరుమల శ్రీవారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని.. శ్రీవారు తనకు పునర్జన్మ ప్రసాదించారని  సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను ఐదు కొండలు అన్నారు. అప్పట్లో తాను తీవ్రంగా ఖండించాను. కొండపైకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. ఇక వైసీపీ హయాంలో కొండపై అపవిత్ర కార్యక్రమాలు జరిగాయి.

ప్రపంచ ప్రఖ్యాతిని గుర్తింపు పొందిన తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వం అపవిత్రం చేసింది. కానీ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.  కొండ పై అపచారం చేసి సమర్థించుకుంటున్నారు. గత పాలకులు నేరం చేశారు. కరుడుగట్టిన నేరస్థుడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వైసీపీ హయాంలో 3.75 లక్షల వీఐపీ టికెట్లు ఇచ్చుకున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. మత సామరస్యాన్ని కాపాడటం నా బాధ్యత. వేరే మతాలను నేను ఎప్పుడూ ద్వేశించలేదు. వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కాపీ కొట్టడానికి ప్రయత్నించారు. ఎవరి వల్ల కాలేదు. వేంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టే ఎవ్వరూ కాపీ కొట్టలేకపోయారన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news