అలాంటి కరోనా వ్యాక్సిన్ వల్ల ప్రపంచానికి పొంచి ఉన్న పెను ప్రమాదం..!

-

కరోనా మహమ్మారి ఈ ప్రపంచంలో ఎంతో మంది జీవితాలను ఎలా అతలాకుతలం చేసిందో చూస్తూనే ఉన్నాం. దాని దెబ్బకు ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. లాక్ డౌన్ దగ్గరి నుండి వ్యాక్సిన్ తయారీ వరకు మొత్తం ఎమర్జెన్సీనే. ఇటువంటి సమయంలో అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ – ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) వారు ఒక సంచలన స్టేట్మెంట్ జారీచేశారు. వారు చెబుతున్నది ఏమిటంటే ఏదైనా కరోనా వ్యాక్సిన్ అప్రూవల్ కి తాము రెడీ గా ఉన్నామని…. అది అన్నీ ఖచ్చితమైన ప్ర‌మాణాల‌ను పాటించాల్సిన అవసరం లేదని చెప్పారు.

మామూలుగా అయితే ఒక వ్యాక్సిన్ తయారీకి కనీసం 5 నుండి 8 సంవత్సరాలు పడుతుంది అని తెలుసు. అయితే ఈ మహమ్మారి విషయానికి వస్తే మాత్రం ఇది ప్రపంచమంతా వ్యాపించిన కారణంగా దీనిని కనీసం ఒక సంవత్సరం లోపల మార్కెట్ లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇలా కొన్ని దేశాలను ఉద్దేశించి కొన్ని కీలకమైన ప్రకటనలు చేసింది. సరిగ్గా చెప్పాలంటే… ఒక వ్యాక్సిన్ అన్నీ క్లినికల్ ట్రయల్స్ జరుపుకోకుండా మార్కెట్ లోకిగనుక వస్తే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉంటాయని హెచ్చరించింది.

అలాగే కనీసం ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ డేటాను పరిశీలించకుండా వాడే వ్యాక్సిన్ వల్ల మానవాళికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలియజేసింది. ఇకపోతే వీటివల్ల వ్యాక్సిన్ తయారీలో తరువాత అడుగులు వేసేందుకు చాలా కష్టం అవుతుందని. ఇలా సగం టెస్ట్ చేయబడినవి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉన్నట్లు తేల్చిచెప్పింది. ఇలాంటి వ్యాక్సిన్ ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోగా వైరస్ కు ఇటువంటి వ్యాక్సిన్ లు ఇవ్వడం వల్ల అవి చనిపోకపోవడమే కాకుండా వ్యాక్సిన్స్ ను తట్టుకోగల సామర్థ్యాన్ని వైరస్ పెంపొందించుకునే అవకాశం ఉందని కూడా తెలిపారు. అప్పుడు మరలా కథ మొదటికి వస్తుంది.

దీనితో ఈ కరోనా ప్రభావం తగ్గకపోగా.. అది మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ఇకపోతే చాలా దేశాలు ఏ రకమైనా వ్యాక్సిన్ తయారీ జరిగినా కూడా.. అది ఏ ఫేజ్ లో ఉన్నా…. దాదాపుగా దాని వాడకానికి నిరాకరించమని తెలియజెప్పిన సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సందేశాన్ని ఇచ్చింది. అయితే వారికి ఒక దేశ విషయాల్లో జోక్యం చేసుకునే వెసులుబాటు లేదు కానీ ఇలా సూచనలు అయితే ఇవ్వచ్చు. అయితే భారతదేశంలో మాత్రం పూర్తిగా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి అయిన తర్వాతే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news