గత కొన్ని రోజులుగా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్బుక్ వాట్సాప్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధి మరోసారి సంచలన కామెంట్స్ చేసారు. భారతదేశ ప్రజాస్వామ్యంపై ఈ రెండు చేస్తున్న దాడి అంతర్జాతీయ మీడియా బహిర్గతం చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసారు.
అంతర్జాతీయ మీడియా ఫేస్బుక్ మరియు వాట్సాప్ యొక్క “భారతదేశ ప్రజాస్వామ్యం మరియు సామాజిక సామరస్యంపై చేస్తున్న తీవ్రమైన” బహిర్గతం చేసింది. ఇద్దరిపై వెంటనే దర్యాప్తు జరపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం విశేషం. ఇటీవల బిజెపి, రాష్ట్ర స్వయం సేవక సంఘ్ చేతిలో ఈ రెండు సామాజిక మాధ్యమాలు ఉన్నాయని రాహుల్ గాంధి తీవ్ర విమర్శలు చేసారు. ఆ తర్వాత ఫేస్బుక్ కూడా వివరణ ఇచ్చింది.