బిగ్ బాస్: ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఆ ఏడుగురు..

-

బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది. ఎప్పటి నుండో ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎదురుచూస్తున్న జనాలకి మంచి షో దొరికింది. మొదటి రోజు కంటెస్టెంట్ల పరిచయం జరిగిపోయింది. ఎప్పటిలానే నాగార్జున మళ్లీ తనదైన ఈజ్ తో బిగ్ బాస్ షోని మొదలు పెట్టాడు. ఐతే మొదలై ఒక్కరోజు కాగానే అప్పుడే ఎవరు ఎలిమేట్ అవుతున్నారన్న వార్త ఊపందుకుంది. దానికోసం ఈ వారం నామినేషన్ లిస్టులో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రకారం ఈ వారం నామినేషన్ లిస్టులో ఉండేవారిలో ఏడుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా వచ్చిన మోనాల్ ఫస్ట్ నామినేషన్ లో మొదటి పేరుగా తెలుస్తుంది. ఇంకా మిగిలిన వారిలో దేవి నాగవల్లి, సింగర్ నోయల్, మెహబూబ్, సూర్యకిరణ్, కరాటే కళ్యాణి, దేత్తడి హారిక ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news