జనసేన పార్టీని జనాల్లోకి మరింత స్పీడ్ గా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బిజెపితో జత కట్టిన ఆ పార్టీ 2024 ఎన్నికలనే టార్గెట్ చేసుకుంటూ స్పీడ్ పెంచుకునే పనిలో నిమగ్నం అయ్యింది. ఈ మేరకు పార్టీలోని అన్ని విభాగాలను బలోపేతం చేసి మరింతగా జనాల్లోకి వెళ్లాలని ఆపై పరపతి పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే జనసేన మీడియా ప్రతినిధులుగా ఇద్దరిని కొత్తగా నియమించారు. అలాగే తమ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా తప్పుడు ప్రచారం జరుగుతుండడం, పవన్ ఏదైనా సందర్భంలో ఏదైనా సమస్యపై స్పందిస్తే, దానిపై దుష్ప్రచారం చేస్తూ, సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు తప్పు పడుతూ వ్యంగ్యంగా అనేక పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇటువంటి వ్యవహారాలను సీరియస్ గా దృష్టి పెట్టారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలు తమ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పోస్టు పెట్టినా, దానికి గట్టి కౌంటర్ వేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో టిడిపి బిజెపి మద్దతు ప్రకటించినా, ఈ తరహా ఎక్కువగా పోస్టులు పెడుతూ వైసిపి కార్యకర్తలు దూకుడుగా వ్యవహరించే వారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రచారం జరుగుతోంది. ఎక్కడ ఏ విషయంపై మాట్లాడినా ఏ స్థాయిలో పవన్ ను తప్పుపడుతూ వస్తున్న పోస్టింగ్స్ పై గట్టి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ లో కౌంటర్ విభాగం ను త్వరలో నే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు చూసీచూడనట్లుగా ఈ వ్యవహారాలను వదిలివేసినా, ఇకపై గట్టి కౌంటర్ ఇవ్వడం ద్వారా జనసేన సిద్ధాంతాలు జనంలోకి తీసుకువెళ్ళవచ్చు అనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ తమపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, తప్పుడు పోస్టు లు కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సీనియర్ న్యాయవాదులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా మరో విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు గా సమాచారం. పవన్ వ్యవహారం చూసుకుంటే ఆషామాషీగా రాజకీయాలు చేసే వ్యక్తిలా కనిపించడం లేదు. కేంద్ర అధికార పార్టీ బిజెపి అండదండలు ఉండడంతో దూకుడుగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లుగా పవన్ వైకిరి చూస్తేనే అర్థమవుతుంది.
-Surya