కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (07-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో సోమ‌‌‌‌వారం (07-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 7th september 2020

1. అన్‌లాక్ 4.0 ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ నెల 21 నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని తాజ్ మ‌హ‌ల్‌, ఆగ్రా కోట‌ల వ‌ద్ద‌కు సంద‌ర్శ‌కుల‌ను అనుమతించ‌నున్నారు. మార్చి 17 నుంచి క‌రోనా కార‌ణంగా ఆయా ప్ర‌దేశాల‌ను మూసివేయ‌గా.. త్వ‌ర‌లో అవి తెరుచుకోనున్నాయి.

2. ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా నుంచి కోలుకున్నారు. ఆయ‌న‌కు కరోనా నెగెటివ్ వ‌చ్చింద‌ని ఆయ‌న కుమారుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ తెలిపాడు. కాగా బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ప్ర‌స్తుతం చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.

3. ఏపీలో కొత్త‌గా 8,368 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంక్య 5,06,493కు చేరుకుంది. 4,487 మంది చ‌నిపోయారు. 4,04,074 మంది కోలుకున్నారు. 97,932 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

4. క‌రోనా నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌ల మ‌ధ్య ఆర్‌టీసీ బ‌స్సుల రాక‌పోక‌లు నిలిచిపోయి చాలా కాల‌మైంది. అయితే ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ – విజ‌య‌వాడ రూట్‌లో బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నారు. ఈ మేర‌కు ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఒక అంగీకారానికి వ‌చ్చాయి.

5. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు భార‌త్‌లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఇబ్బందులు త‌లెత్తాయి. చండీగ‌ఢ్ కేంద్రంలో ట్ర‌య‌ల్స్ ప్ర‌క్రియ ఆల‌స్యం అవుతోంది.

6. దేశంలో కొత్త‌గా 90,802 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 42,04,614కు చేరుకుంది. 8,82,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 32,50,429 మంది కోలుకున్నారు. 71,642 మంది చ‌నిపోయారు.

7. తెలంగాణ‌లో కొత్త‌గా 1802 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,42,771కి చేరుకుంది. 895 మంది చ‌నిపోయారు. 1,10,241 మంది కోలుకున్నారు. 31,635 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

8. క‌ర్ణాట‌క‌లో క‌రోనా రీ ఇన్‌ఫెక్ష‌న్ కేసు న‌మోదైంది. బెంగళూరులోని ఓ మ‌హిళ‌కు రెండో సారి క‌రోనా సోకింది. జూలై నెల‌లో ఆమెకు కరోనా పాజిటివ్ రాగా.. తాజాగా ఇప్పుడు మ‌ళ్లీ ఆమెకు క‌రోనా సోకింది.

9. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొత్త‌గా 2.23 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2.72 కోట్ల‌కు చేరుకుంది. మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనాతో 8.87 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు.

10. పంజాబ్‌లో కోవిడ్ బారిన ప‌డ్డ పోలీసుల సంఖ్య 3800కు చేరుకుంది. 2186 మంది పోలీసులు కోలుకున్నారు. 1597 మంది చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు అక్క‌డ రూ.1700 విలువ గ‌ల కిట్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news