శాంసంగ్ సంస్థ తన గెలాక్సీ జడ్ ఫోల్డ్ 2 మడతబెట్టే ఫోన్‌ను భారత్‌లో ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ ధరను శాంసంగ్ శుక్రవారం వెల్లడించింది. ఈ ఫోన్‌ను భారత్‌లో రూ.1,49,999కు విక్రయించనున్నారు. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. దీనిపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి 4 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌ను కొన్నవారికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365ను 22 శాతం డిస్కౌంట్‌తో అందిస్తారు.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్లో 7.3 ఇంచుల క్యూఎక్స్‌జీఏ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది లోపలి వైపు ఉంటుంది. బయటి వైపు 6.2 ఇంచుల హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్పినిటీ ఫ్లెక్స్ కవర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. లోపలి డిస్ప్లే 2208 x 1768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉండగా, బయటి వైపు డిస్ప్లే 2260 x 816 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.
ఇందులో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 12 జీబీ ర్యామ్ ఉంది. 256/512 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తోంది. ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్ ఉంది. వెనుక వైపు 12, 12, 12 మెగాపిక్సల్ కెమెరాలను మూడింటిని అమర్చారు. ముందు వైపు 10 మెగాపిక్సల్ కెమెరా, కవర్ మీద 10 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి.
డాల్బీ అట్మోస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి.