కరోనా విలయ తాండవం.. మిలియన్ మార్కుకి చేరువలో మహారాష్ట్ర..

అంటువ్యాధి వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ఎక్కడ చూసుకున్నా కరోనా విస్తరిస్తూనే ఉంది. ఐతే మనదేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రం.. మహారాష్ట్ర. మొదటి నుండి చూసుకున్నా కరోనా కేసుల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం కేసులు 9,90,000కి పైగా దాటాయి. రోజు రోజుకి కనిపిస్తున్న పెరుగుదల మిలియన్ మార్క్ ని టచ్ చేయడానికి సిద్ధం అవుతోంది.

మహారాష్ట్రలో రోజూ 20,000కి పైగా కేసులు వస్తున్నాయి. ఆగస్టు నెల చివరి నాటికి కరోనా కేసులు తగ్గినట్లు అనిపించాయి. కానీ ఈ నెలలో మళ్లీ విజృంభించి దేశ వృద్ధి రేటుని దాటేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర రోజువారి వృద్ధి రేటు 2.32 శాతంగా ఉంటే జాతీయ వృద్ధి రేటు 2.13శాతంగా ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 25శతానికి పైగా ముంబై, పూణే నగరాల్లోనే వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నాసిక్, నాగ్‌పూర్, రాయ్‌గడ్, జల్గోన్, కొల్హాపూర్, పాల్‌ఘర్‌లో ఇప్పుడు 30,000 కి పైగా కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,90,795 గా ఉంటే, ఆక్టివ్ కేసులు 2,90080 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా వల్ల ఇప్పటి వరకు 28,648మంది చనిపోయారు.